హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గతంలో ప్రకటించినట్టుగా 10వేల పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరుచేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్, నాగిరెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను మంజూరుచేయాలని, నాలుగు పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలి డిమాండ్ చేశారు.