హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తేతెలంగాణ) : మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ కలిగిన ప్రయాణికులు లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ త దితర ఏసీ సర్వీసుల్లో 10శాతం రాయితీని పొందొచ్చని ఆర్టీసీ తెలిపింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ డిసౌంట్ వర్తించనుందని పేరొంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌తోపాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్‌పాస్ కలిగిన ప్రయాణికులు ఈ రాయితీని పొందే అవకాశం ఉంటుంది. జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉండనుంది.