హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): గతంలో టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలు, ప్రఖ్యాత గాయని దివంగత లతా మంగేష్కర్ ఆఖరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున రూ.10 లక్షల చెక్కును మంగళవారం విరాళంగా అందజేశారు.
తిరుమల శ్రీవారికి విరాళం ఇవ్వాలని ఆమె వీలునామా రాసుకున్నారు. అది నెరవేరకుండానే 2022 ఫిబ్రవరి 6న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు మంగళవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సమక్షంలో విరాళం చెక్కును టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.