హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): మరో సరికొత్త రాష్ట్ర గే యం ప్రజలకు అందుబాటులోకి రానుంది. తెలంగాణ కవి, మిట్టపల్లి సురేందర్ కలం నుంచి జాలువారిన గేయం జూన్ 1న యూట్యూబ్ వేదికగా విడుదల కానుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు ప్రతిబింబించే విధంగా సరికొత్త గేయం ఉంటుందని, తెలంగాణ గాయకులే పాడారని సురేందర్ తెలిపారు.