వజ్రోత్సవ భారతికి కోటి జెండాల వందనం
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. రూ.23 కోట్ల వ్యయంతో 60 లక్షల మీటర్ల స్వచ్ఛమైన పాలిస్టర్ వస్త్రంతో వీటిని రూపొందిస్తున్నారు
- 60 లక్షల మీటర్ల వస్త్రం.. తయారీలో నేతన్నలు
- 50 లక్షల జెండాలు సిరిసిల్లలో, 50 లక్షలు హైదరాబాద్‌లో తయారీ
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. రూ.23 కోట్ల వ్యయంతో 60 లక్షల మీటర్ల స్వచ్ఛమైన పాలిస్టర్ వస్త్రంతో వీటిని రూపొందిస్తున్నారు. వస్త్రం తయారీ, రంగుల అద్దకం, జెండాలు కుట్టడం తదితర పనులన్నీ నేత కార్మికులే చేస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 50 లక్షల జెండాలను సిరిసిల్లలో, మిగిలిన 50 లక్షల జెండాలను హైదరాబాద్‌లో కుట్టిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఈ నెల ఐదు నుంచి పదో తేదీలోగా జెండాలు జిల్లాలకు రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒకటి చొప్పున ఉచితంగా జెండాలు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. జెండాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఇక్కడే తయారు చేసుకోవడం వల్ల నేత కార్మికులకు ఉపాధి కలుగుతున్నదని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

