హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు రూ.1.90 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. వారిద్దరిని విచారించగా తెలంగాణలో పొలం అమ్ముకొని, ఆంధ్రాలో కొని రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు డబ్బులు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. సరైన ఆధారాలు లేకపోవటంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని ఇన్‌కంట్యాక్స్ ఆఫీస్‌లో అందజేశారు.