నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 1.73 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 1.72 లక్షల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 585.50 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో మొత్తం 312.04 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 298.87 టీఎంసీల నీరు ఉన్నది.