శాలిగౌరారం, జూలై 24 : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూర్‌కు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకుడు, సాంస్కృతిక విభాగం ఉమ్మడి జిల్లా మాజీ కోఆర్డినేటర్ వేముల నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. నరేశ్ది నిరు పేద కుటుంబం కావడంతో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అండగా నిలిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఆయన ముగ్గురు పిల్లలు అభిషేక్, ధనుశ్, తన్వీ పేరిట ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షలు స్థానిక బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఆ బాండ్లను బీఆర్ఎస్ శాలిగౌరారం మండల అధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, నాయకులు కట్టా వెంకట్‌రెడ్డి, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్‌బాబు ద్వారా బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు పంపించారు.
పరిపూర్ణ నాయకుడు కేటీఆర్ సామాజికవేత్త సునీతాకృష్ణన్ కితాబు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రపంచం మొత్తంలో ఉన్న అతికొద్దిమంది స్ఫూర్తిదాయకమైన నాయకుల్లో ఒకరని ప్ర ముఖ సామాజికవేత్త సునీతాకృష్ణన్ కితాబిచ్చారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎక్స్ వేదికగా సునీతాకృష్ణన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, నా యకత్వ లక్షణాలను ప్రశంసించారు. ‘ప్రపంచవ్యాప్తంగా పరిపూర్ణ నాయకత్వ శైలితో, నిస్వార్థంగా ఉంటూ నిర్మాణాత్మక చర్యలతో స్ఫూర్తినింపే నాయకులు కొద్దిమంది మాత్ర మే ఉన్నారు. వారిలో కేటీఆర్ ఒక యువ నాయకుడని నేను భావిస్తున్నాను’ అని కొనియాడారు. వారు నేత కార్మికులకు అండగా నిలిచారు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంచి తోడ్పాటునిచ్చారు, పలువురికి వైద్యసహాయం అందించారని పేర్కొన్నారు.