సైదాపూర్, జూన్ 7 : కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ చట్ల ఆంజనేయులు బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40లక్షలు కాజేశారు. వివరాల్లోకెళ్తే.. అంజనేయులు సెల్‌ఫోన్‌కు మే 30న ఆధార్‌నెంబర్‌తో సహా ఓటీపీ వచ్చింది. దీనికి కానిస్టేబుల్ బదులు ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు అతని సిమ్ కార్డు పనిచేయకపోగా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. దీంతో అతని నెంబర్ బ్లాక్ అయిందని వారు సమాచారం ఇచ్చారు. తిరిగి కొత్త సిమ్‌కు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 5న కొత్త సిమ్ వచ్చింది. దానిని ఫోన్లో వేసుకుని చూసుకోగా, అతని బ్యాంకు ఖాతాలో రూ.1.93 లక్షలకు బదులు రూ.50 వేల నగదు మాత్రమే ఉన్నది. ఇదేంటని బ్యాంక్‌కు వెళ్లి అడగ్గా, మే 31 నుంచి జూన్ 5 వరకు రూ.1.40 లక్షలు డ్రా చేసుకున్నట్టు బ్యాంకు అధికారులు వివరాలు అందజేశారు. దీంతో మోసపోయానని గ్రహించి ఆంజనేయులు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.