హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : హోలీ పండుగ షాపింగ్, ఈవెంట్ బుకింగ్‌లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ చెప్పారు. వాట్సాప్, ఎస్ఎమ్ఎస్, సోషల్ మీడియా ద్వారా ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ): ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ కళకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నదని గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గిరిజన సాంసృతిక పరిశోధన-శిక్షణ సంస్థ (టీసీఆర్ఐ) ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గిరిజన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో సర్వేశ్వర్‌రెడ్డి, టీసీఆర్ఐ సంచాలకురాలు డాక్టర్ సముజ్వల, డాక్టర్ సునీతాప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ జేడీలు పోచం, సంధ్యారాణి, సూపరింటెండింగ్ ఇంజినీర్ హేమలత, గిరిజన మ్యూజియం క్యురెటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, పీఈటీసీ కో ఆర్డినేటర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.