సింగపూర్, నవంబర్ 26: మనిషి జీవితంలో హాస్యం ఎంతటి ఆహ్లాదాన్ని పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే, మంచి హాస్యం, హాస్య చతరుత భార్యాభర్తల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. జీవిత భాగస్వాములు తరుచూ పరస్పరం హాస్యం పండించుకొంటూ ఉంటే ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణ కూడా పెరుగుతుందని సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలోని సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కెన్నెత్ తాన్ తెలిపారు. మనం సహజంగానే ఎవరిపట్ల అయినా ఆకర్షితులమైతే వాళ్లకు దగ్గర కావటానికి హాస్యాన్ని పండించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. సగటున 18.27 నెలలపాటు రిలేషన్లో ఉన్న 108 జంటలపై పరిశోధన నిర్వహించిన ఈ విషయాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.