హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ భవిష్యత్ దృష్ట్యా సమ్మె నిర్ణయంపై పునరాలోచించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈనెల 7నుంచి టీజీఎస్ ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం ఆయన స్పందించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చామని.. ప్రస్తు తం సమ్మె చేయాల్సిన పరిస్థితిలో ఆర్టీసీ లేదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌక ర్యం, ఆర్టీసీ పరిరక్షణకు రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. పెండింగ్ పీఎఫ్ బకాయిలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమ్మెపై తనను ఇప్పటి వర కు ఎవరూ కలవలేదని, లేబర్ కమిషనర్‌కు మాత్రమే సమ్మె నోటీసు అందజేశారని వివరించారు. ఆర్టీసీ సంస్థ నిలబడాలని, 40వేల కుటుంబాలు బాగుపడాలని కోరుకునే ప్రభుత్వం తమదని పొన్నం తెలిపారు.
‘సారథి’ పోర్టల్ ప్రారంభం
సికింద్రాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా ‘సారథి పోర్టల్’ను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులో కి తెచ్చేందుకు ఈ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.