నిజామాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న హరితహారంపై నిజామాబాద్ యువకుడు కే మనోజ్‌కుమార్ వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిక్షణలో భాగంగా శాండ్ ఆర్ట్‌తో కళాఖండాలను తీర్చిదిద్ది సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇసుకలో సామాజిక అంశాలపై చిత్రాలు గీస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. తాజాగా శాండ్ఆర్ట్తో హరితనిధిపై చిత్రాన్ని, హరితహారం లోగోను రూపొందించారు.