హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు మారిపోయాయని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబాన్ని, అతడి తమ్ముడిని అక్రమంగా వేధిస్తున్నారంటూ డీజీపీ జితేందర్‌కు గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు. వారిపై పెట్టిన అక్రమ కేసులపై రివ్యూ చేసి, తక్షణమే ఎత్తివేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ నేతలపై రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణం ఇలాంటి కక్షసాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. బీసీలను రాజకీయాల్లో ఎదగనీయకుండా అణగదొక్కే కుట్ర జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల నుంచి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబాన్ని తప్పించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే అనేక చోట్ల బీఆర్ఎస్ నేతలపై ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడి డీజీపీ చర్యలు తీసుకోకుంటే, ఊపేక్షించబోమని హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబానికి న్యాయం చేయకపోతే తిరుగుబాటు తప్పదని స్పష్టంచేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కుతామంటే ఎలా అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ అంధుల కాలనీని కూలగొడితే బాధితులకు తాము ధైర్యం చెప్పి మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. వారికి అ న్నం పెట్టినందుకు, వచ్చిన ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ కక్షసాధిస్తున్నదని చెప్పా రు. 20 ఏండ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన భూముల ఫైలు దొరకకపోతే దానికి అంధులా కారణమని ప్రశ్నించారు. వారికి పట్టాలివ్వాలని అడిగినందుకు తన తమ్ముడిపై కేసులు పెట్టించడమేంటని మండిప్డడారు. తా ను మంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల సమస్య లు, ప్రమోషన్లు, రిస్క్ అలవెన్స్‌ల గురించి పో రాడినట్లు చెప్పారు. ‘వందకు వందశాతం రే పు మా ప్రభుత్వం వస్తుంది రాసుకోండి. మీ రు ఎన్ని నిర్బంధాలు పెట్టినా వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. సీఐ, డీఎస్పీ చెప్పమన్నడని మీ పేర్లు కూడా అందులో పెడితే.. మీ కుటుంబా లు కూడా ఎంత బాధపడ్తయో మీరూ ఆలోచించాలి’ అని సూచించారు. ప్రశ్నించిన వారి ని ఇబ్బంది పెడుతూ.. పదేండ్లకు సరిపడా సెక్షన్లు, జీవిత ఖైదు సెక్షన్లు పెట్టి ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. ‘తెలంగాణ పోరాటంలో ప్రాణాలకు తెగించి కొట్లాడినం. మీ పిచ్చి కేసులకు భయపడే వాళ్లం అసలేం కాదు. పోలీసు వ్యవస్థపై నమ్మకం కుదరాలంటే.. నా తమ్ముడిపై పెట్టిన కేసులను డీజీపీ సమగ్రంగా విచారణ జరిపి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి’ అని శ్రీనివాస్‌గౌడ్ కో రారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాల్గొన్నారు.