హైదరాబాద్, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ): అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులకు అందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఈ రెండేండ్లలో రాష్ర్టానికి, అందోల్-జోగిపేట మున్సిపాలిటీకి జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లకు వివరించారని, మంత్రి బెదిరింపులకు బెదరకుండా అహర్నిశలు శ్రమించారని కొనియాడారు.
పార్టీ కోసం కృషిచేసిన అభ్యర్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని కష్టించిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీని గెలువడానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికార దూర్వినియోగానికి పాల్పడ్డారని, ఓటర్లను ప్రలోభపెట్టడానికి కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.5 వేల చొప్పున పంచారని ఆరోపించారు.