హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ మాజీ నేత, సామాజిక కార్యకర్త బక్కజడ్సన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని ఆయనను ఇకపై మూసీరెడ్డిగా పిలవాలని పేర్కొన్నారు. ఆ నదికి ఆయన అంబాసిడర్‌గా వ్యవహరించాలని సూచించారు. మూసీ వెంబడి ఉన్న ఫార్మా కంపెనీలతో నది విషతుల్యం అవుతున్నదని పేర్కొన్నారు.
వ్యర్థాలు వదులుతున్న ఆ కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మూసీలోకి వ్యర్థా లు రాకుండా నియంత్రించడం మానేసి ఫార్మా కంపెనీల నుంచి కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో ప్రభుత్వం స్వీకరించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మూసీ పేరును ఎందుకు పెట్టుకోవడం లేదని ప్రశ్నించిన రేవంత్‌కే ఆ పేరు సరిపోతుందని తెలిపారు.