హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేద బ్రాహ్మణ యువత రిటైల్ రంగంలో ఉద్యోగాలకోసం ఈ నెల 18లోపు brahminparis had.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పాలనాధికారి రఘురామ శర్మ సూచించారు. ఇందుకు అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల వయసు ఉండాలని తెలిపారు.
యువతకు ఈ నెల 23న హైదరాబాద్ బొగ్గులకుంట బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎంపికైన వారికి తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు శిక్షణ అందించి, ఈ నెల 28 నుంచి రిటైల్ రంగంలో ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగంలో చేరాక నెలకు రూ. 14,000 నుంచి రూ. 15,000 వరకు వేతనం లభిస్తుందని వివరించారు.