కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ అంశంపై కదలిక వచ్చింది. బరాజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ఫిజిబులిటీ నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. వార్ధా-వైన్‌గంగ సంగమ స్థానంలో బరాజ్ నిర్మించాలని ప్రభు త్వం సంకల్పించింది. ఇదే విషయమై కాంగ్రెస్ సర్కార్ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరింది. సీడబ్ల్యూసీ నుంచి అనుకూల నివేదిక, మహారాష్ట్ర నుంచి అంగీకారం లభిస్తే ప్రాణహితపై బరాజ్ నిర్మాణానికి ముందడుగు పడే అవకాశాలున్నాయి.
తమ్మిడిహెట్టి వద్ద.. వార్ధా-వైన్‌గంగ సంగమ స్థానం లో బరాజ్ నిర్మించేందుకు 2008లో అ ప్పటి ప్రభుత్వం నివేదికలు తయారు చే సింది. వివిధ కారణాల వల్ల ఆగిపో యింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా త సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అప్ప టి ప్రభుత్వం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు ని ర్మాణం చేపట్టింది. తమ్మిడిహెట్టి వద్ద బ రాజ్ నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం చర్యలు చేపట్టగా.. ఆ ప్రదేశాన్ని గ తంలో మంత్రులు కూడా పరిశీలించా రు. ఫీజిబులిటీ నివేదికను కేంద్రానికి పంపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొంటేనే బరాజ్ నిర్మాణం సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.