హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వ టీ-శాట్ టీవీ చానళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ల్యక్షంతో నేడు మూగబోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతున్నారని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో చేసుకోవలసిన ఒప్పందంపై జీశాట్ 16 శాటిలైట్ సేవలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎస్ఐఎల్ విరమించుకుందని వాపోయారు. టీ-శాట్ నెట్వర్క్ సేవలను తక్షణమే పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
.
KT Rama Rao demanded that the TSAT network services should be immediately resumed