తెలంగాణలో ప్రజల పరిస్థితి దారుణంగా తయారంది. దసరా, దీపావళి పండుగ ముందు ప్రభుత్వం ఏదైనా శుభవార్త చెప్తదేమో అని ఎదురు చూస్తున్న ప్రజలకు పిడుగు లాంటి వార్త తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
ప్రజలపై రూ.5,420 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు ఈ సర్కారు సిద్దమవుతున్నదని తెలిపారు. కరువు, ఎల్ నినో, పెరిగిన నిత్యావసర ధరలతో బాధపడుతున్న ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని మోపొద్దని, తక్షణమే పెంచిన ఛార్జీలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని హరీష్ అన్నారు.