న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టిన సమయంలో ఓ విద్యార్థి తండ్రిపై దాడి చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. కఠినమైన షరతులతో మూడు వారాల పాటు తాత్కాలిక బెయిల్‌ను గతంలో మంజూరీ చేసినట కోర్టు, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ జారీ చేసింది. తాత్కాలిక బెయిల్ సమయంలో భరద్వాజ్ ప్రవర్తన ఆధారంగా రెగ్యులర్ బెయిల్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 15వ తేదీన తాత్కాలిక బెయిల్ ఇస్తూ కోర్టు ఆదేశాలు చేసింది. అయితే ప్రవర్తన ఆదారంగా రెగ్యులర్ బెయిల్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది.
సోషల్ మీడియాలో కానీ, ఇతర ప్లాట్ఫామ్ల్లో ఆ కేసు గురించి పోస్ట్, పబ్లిషింగ్, చర్చించడం చేయవద్దు అని కోర్టు చెప్పింది. సెప్టెంబర్ 4వ తేదీన బులంద్‌షెహర్‌లో భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కార్యకర్త తండ్రిపై దాడి జరిగిన కేసులో భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 23వ తేదీన నిరసన జరిగిన సమయంలో ఓ కార్యకర్త తండ్రి తలను కొట్టినట్లు భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కానీ అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. సెప్టెంబర్ 7న జుడిషియల్ కస్టడీలోకి తీసుకుని భరద్వాజ్‌ను తిహార్ జైలుకు తరలించారు. తాత్కాలిక బెయిల్‌పై 18వ తేదీన రిలీజ్ చేశారు.