మరికల్, జనవరి 8 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రీడిజైన్ చేస్తే తీరని అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పాలమూరు-డిండి ప్రాజెక్టుగా మార్చాలనుకో డం సరికాదని, ఇదే గనుక జరిగితే ఉమ్మ డి మహబూబ్నగర్ జిల్లాకు తీరని అన్యా యం జరుగుతుందని ఆందోదళన వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన నారాయణపేట జిల్లా మరికల్లో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తే.. కాంగ్రెస్ దాన్ని రీడిజైన్ చేసేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. జూరాల డ్యాం నుంచి 90 కి.మీ దిగువకు నీటి కేటాయింపులను మార్చితే రైతులకు నీళ్లు అందే పరిస్థితి లేదని అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే వెంట నే సీఎంను నిలదీయాలని సూచించారు. ఈ సందర్భంగా 14 మంది ఎమ్మెల్యేలకు ఆయన బహిరంగ లేఖలను రాశారు.