హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రపంచస్థాయి పర్యాటక రంగానికి కావాల్సిన వనరులు ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో ప్రచారం లభించకపోవడం తీరని లోటని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడుల కోసం త్వరలోనే టూరిజం కాన్క్లేవ్ నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో శుక్రవారం జరిగిన ‘ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్-2025’ ప్రారంభ కార్యక్రమంలో జూపల్లి పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘బతుకమ్మ విశిష్టత-ఆచరణ’ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి: సురేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎకో టూరిజం కోసం గుర్తించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.