హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : అక్టోబర్ చివరిలోగా సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నరసింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం.. సనత్‌నగర్, ఎల్బీనగర్, కొత్తపేట టిమ్స్‌తోపాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ సూపరల్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై సెక్రటేరియట్‌లోని తన చాంబర్లో ఆరోగ్యశాఖ, ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో హెల్త్సెక్రటరీ క్రిస్టినా, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, డీఎంఈ నరేంద్రకుమార్, ఆర్అండ్బీ సీఈలు రాజేశ్వర్‌రెడ్డి, లింగారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రాధాన్యం: అడ్లూరి
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్నాకా సహారా పథకాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు స్కీంలతో మైనార్టీ మహిళల బతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆకాంక్షించారు.