నాంపల్లి కోర్టులు, అగస్టు 21 (నమస్తే తెలంగాణ): న్యాయవాదుల భద్రతకు ప్రత్యే క చట్టం అవసరంపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్‌ను బుధవారం ఆదేశించారు. న్యాయవాదులపై దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. న్యాయవాదులకు గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వారి పై దాడులు జరుగుతున్నాయన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏఏజీకి సూచించారు.
న్యాయవాదిపై దాడి కేసులో నోటీసులు
కూకట్పల్లి బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది సంతోష్ కుమార్‌పై ఈ నెల 16 న బోరబండ పోలీసులు దాడి చేసినట్టు వచ్చి న కథనాలపై హైకోర్టు బుధవారం మరోసారి విచారించింది. కేసులో కౌంటర్లు దాఖ లు చే యాలని సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్, బోరబండ్ ఎస్‌హెచ్‌వో, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కు నోటీసులిచ్చింది.
ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడుతున్న ఖర్గే మీడియాతో మందకృష్ణ మాదిగ
ఖైరతాబాద్, ఆగస్టు 21: ఎస్సీల వర్గీకరణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇతర రాష్ర్టాల్లో వర్గీకరణకు కాం గ్రెస్ మద్దతునిచ్చిందని, కానీ ఖర్గే వ్యతిరేకించారని అన్నారు. వర్గీకరణపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మౌనం వెనుక కూడా ఖర్గేనే ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మందకృష్ణ జర్నలిస్టులతో మాట్లాడారు.