హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన కేంద్రంగా భాసిల్లుతున్న టీహబ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద ఈ నిధులు మంజూరు చేసింది. ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు ఈ ని ధులను వెచ్చించనున్నట్టు టీహబ్ సీఈవో ఎంఎస్ రావు చెప్పారు. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చేవారికి టీహబ్ అన్ని విధాలుగా
సహకరిస్తున్నదన్నారు.