వీణవంకరూరల్/హుజూరాబాద్‌రూరల్, అక్టోబర్ 11: టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. సోమవారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ఎరుకుల కులస్థులు 100 మంది టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యేలు సండ్ర, పెద్ది కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ముషం యాదగిరి ఎమ్మెల్యే వొడితల సతీశ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. హుజూరాబాద్ 16వ వార్డుకు చెందిన బండ నవీన్, బండ మనోజ్‌తోపాటు 50 మంది బీజేపీ నాయకులు మంత్రి గంగుల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. హుజూరాబాద్ కొత్తపల్లివాసులు మంత్రి గంగుల, ఎమ్మెల్సీ మల్లేశంను కలిసి మద్దతు తెలిపారు.