జూరాలకు భారీగా వరద

- నారాయణపూర్ డ్యాం 8 గేట్లు ఎత్తివేత
- నేటి సాయంత్రానికి జూరాలకు జలాలు
మహబూబ్‌నగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూరాలకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బుధవారం మధ్యాహ్నం 8 గేట్లు తెరిచి 42,940 క్యూసెక్కులు దిగువనకు వదిలారు. ఆల్మట్టి డ్యాంకు 75,278 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 40 వేల క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 519.60 మీటర్లు కాగా.. ప్రస్తుతం 517.33 మీటర్లకు చేరింది. సామర్థ్యం 123.08 టీఎంసీలకు 88.630 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో జూరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి జలాలు జూరాలకు చేరుకునే అవకాశం ఉందని ప్రాజెక్టు ఏఈఈ బీచుపల్లి తెలిపారు. జూరాల డ్యాం సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.188 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
లక్ష్మీ బరాజ్ గేట్లు మూత
కాళేశ్వరం, జూన్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి బరాజ్ గేట్లను బుధవారం సాయంత్రం అధికారులు మూసివేశారు. ప్రాణహిత నది నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గేట్లు బంద్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, లక్ష్మి పంప్‌హౌస్‌లో పది మోటార్ల ద్వారా సరస్వతి బరాజ్‌లోకి నిత్యం రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

