హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): సినిమా, వెడ్డింగ్, హాస్పిటాలిటీ తదితర రంగాలకు సంబంధించిన వినూత్న ఎక్స్పరిమెంటల్ టూరిజం కాంక్లేవ్-24కు హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. పర్యాటకరంగ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర పర్యాటకశాఖ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తాధ్వర్యంలో జూన్ 20 నుంచి 23వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ సదస్సును నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయస్థాయి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.