ధర్మపురి, ఆగస్టు 14: విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన అనేకమంది వలసజీవులు మోసపోయి చేయని నేరానికి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తాజాగా, తెలంగాణకు చెందిన ఆరుగురు, ఏపీకి చెందిన ముగ్గురు.. మొత్తం తొమ్మిది మంది దుబాయ్‌లో ఓ ముఠా చేతిలో మోసానికి గురై పోలీస్ కేసులో ఇరుక్కున్నారు. జగిత్యాల జిల్లా ఎండపెల్లికి చెందిన మంతెన కిరణ్ స హాయం కోసం దుబాయ్ నుంచి సెల్ఫీ వీడి యో తీసి స్నేహితులకు, ఎండపెల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డికి పంపగా విషయం వెలుగులోకి వచ్చింది.
కిరణ్‌తోపాటు ఏపీకి చెందిన వాసును చేయని నేరానికి పోలీసులు రెండు రోజులు విచారించి విడిచిపెట్టారు. మిగతా ఏడుగురు పోలీసుల అదుపులో ఉన్నట్టు కిరణ్ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. ప్రస్తుతం దుబాయ్‌లోని జెబలాలి ప్రాంతంలోని సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్టు పేర్కొన్నాడు. అయితే ముఠా సభ్యులు వీరి వద్ద నుంచి ఐడీకార్డులు, బ్యాంకుఖాతాల వివరాలు తీసుకొని అక్కడ రుణాలు తీసుకొని ఆర్థిక మోసాలకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నాడు.