సంగారెడ్డి, మార్చి 24(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో గురువారం మెడికల్ సింపోజియమ్ ప్రారంభమైంది. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మెడికల్ సింపోజియమ్ను ప్రారంభించారు. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్హెచ్ఈ)తోపాటు వేర్వేరు సంస్థలు అభివృద్ధి చేసిన నూతన వైద్య పరి కరాలను ప్రదర్శించాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వైద్యులతోపాటు వైద్య పరికరాల తయారీ పరిశ్రమల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్హెచ్ఈ) అభివృద్ధి చేసిన పలు నూతన వైద్య పరికరాలు ఆహ్వానితులను ఆకట్టుకొన్నాయి. ఇందులో జీవన్ లైట్ వెంటిలేటర్‌తోపాటు టీ-వర్క్స్ అభివృద్ధి చేసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, వెంటిలేటర్, ఎన్లైట్, రోబో హ్యాండ్, ఫిజియోథెరిపీకి అవసరమయ్యే ఆర్మ్-ఏబుల్ తదితర పరికరాలు విశేషంగా ఆకట్టుకొన్నాయి.