మహదేవూపూర్(కాళేశ్వరం), ఫిబ్రవరి 20 : ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట నిఘా కొనసాగాలని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్, ఎలేశ్వరం, అన్నారం, పలుగుల, పూసుకుపల్లి, ముద్దులపల్లిలో ఇసుక రీచ్‌లను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఆయా ఏరియాల్లో ఇసుక స్టాకు, గోదావరిలో ఇసుక తీసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24/7 ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఇసుక కొరత లేకుండా బుకింగ్ చేయడానికి అవకాశం కల్పించినట్టు తెలిపారు.