యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి భక్తు లు భారీగా రావడంతో బాలాలయంలోని దర్శన క్యూ లైన్లు నిండిపోయాయి. పురవీధులు సందడిగా మారాయి. దర్శనాల అనంతరం ప్రసాద విక్రయశాల వద్ద ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు భారీగా క్యూలో నిలుచున్నారు. భక్తుల సంద డితో కొండపైకి ఇతర వాహనాలను అనుమతినివ్వలేదు. కొండకిందనే వాహనాలను నిలిపి దర్శనాలకు వెళ్లారు.
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ జాయింట్ సెక్రటరీ చరణ్ జీత్సింగ్, డైరక్టర్ ఆర్పీసింగ్, పంచాయతీరాజ్ కమిషనర్ రాష్ట్ర శరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, అధికారులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయ ముఖ మండపంలో అర్చకులు వారికి స్వామివారి వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.