హైదరాబాద్: జంబో వ్యాక్సినేషన్ డ్రైవ్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయిదు నిమిషాల్లోనే అలా వెళ్లి ఇలా వ్యాక్సిన్ వేసుకుని వచ్చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న హైటెక్స్ ప్రాంగణంలో ఇవాళ అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ సాగింది. వేలాది మంది హైదరాబాదీలు ఉత్సాహంగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కేవలం ట్రాఫిక్ జామ్ తప్ప.. ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇబ్బందిపడలేదు. వ్యాక్సిన్ తీసుకున్న యువత ఇక తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఫోటోలు, వీడియోలను వ్యాక్సినేట్ అయిన వారు పోస్టు చేశారు. ఫస్ట్ షాట్ తీసుకున్నానంటూ ట్విట్టర్ యూజర్ ఉదయ్ గుప్తా ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రత్యక్షంగా తిలకించినట్లు పేర్కొన్నాడు. 40వేల మందిని వ్యాక్సినేట్ చేసేందుకు అక్కడ 300 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
మెడికవర్, ఎస్సీఎస్సీ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ సాగింది. వ్యాక్సినేషన్ సెంటర్‌కు రావడం అద్భుతమైన అనుభవమని, పొడుగైన క్యూలైన్లు లేవని, కొన్ని నిమిషాల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియ ముగిసిందని మరో ట్విట్టర్ యూజర్ తెలిపాడు. ఇలాగే వ్యాక్సినేషన్ జరిగితే.. చాలా తక్కువ సమయంలోనే హైదరాబాద్ మొత్తాన్ని వ్యాక్సినేట్ చేయవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నా మిత్రుడు కేవలం 5 నిమిషాల్లో వ్యాక్సిన్ వేసుకుని తిరిగివచ్చినట్లు మరో యూజర్ ట్వీట్ చేశాడు. కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన కాగ్నిజాంట్కు థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆ సంస్థ ఉద్యోగి ఒకరు ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాక్సిన్ డ్రైవ్నే ఎల్బీ స్టేడియంలోనూ నిర్వహించాలంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
@drgsrao describes mega #Vaccination drive a joint initiative of @cyberabadpolice @SCSC_Cyberabad & @MedicoverIN held in #Hyderabad
— Mohammed Hussain (@writetohussain) June 6, 2021
as the biggest ever #VaccinationDrive #VaccinateIndia #VaccineForAll #vaccinationupdates @TheHansIndiaWeb pic.twitter.com/XSsP2vjhME
Got #vaccinated in Medicover Vaccination drive! #Hyderabad'sbiggestvaccinationdrive
— Ajay Singh (@ajoykummar24) June 6, 2021
Thank you Telangana govt, @cyberabadpolice and @MedicoverIN for fast and proper arrangement. #covaxinated #Covaxin pic.twitter.com/1yZ3DD1FFv
Hyderabads biggest vaccination drive is very well organized and super successful! Didn't have to wait even a minute at the centre. Thank you so much for making this possible! Hope you will conduct similar vaccination drive for the second dose too! 👏👌👍🙏🙂#Covaxin #hyderabad pic.twitter.com/lXiiITeKeP
— Talluri Vijay (@TalluriVijay111) June 6, 2021
Got My First Shot ✅ #Vaccinated #LetsGetVaccinated 🙏👍#indiafightscovid19 #hyderabad #India 🇮🇳 #covaxin.
— Uday Gupta (@udaykumararveti) June 6, 2021
Witnessed the World's biggest Vaccination Drive 🤗🌏 pic.twitter.com/32NpwgEOpZ
Thank you @MedicoverIN & @CYBTRAFFIC @KTRTRS for the greatest, biggest vaccination drive in HITEX Hyderabad.! It was a delightful experience, no waiting no long queues.! Vaccinated in just few mins.! In this way we can get the whole Hyderabad vaccinated in a short period of time. pic.twitter.com/TNyHP5myzz
— SKY (@SKY73243414) June 6, 2021
A glimpse into thick flow of traffic at Mega #vaccination drive at Hitex #Hyderabad
— Shiva_THReporter (@Shiva_THNews) June 6, 2021
Main road leading to the venue was packed bumper-to-bumper pic.twitter.com/sMGNzdTDQd