సైదాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం పట్ల ఆఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోలు మహేందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో చేసిన ఉద్యమ నాయకులకు సరైన న్యాయం చేశారని అన్నారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్ధి నాయకుడికి అవకాశం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. గెల్లు శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశారని, చాలసార్లు ఆరెస్టు అయి జైలు జీవితం గడిపిన ఉద్యమ నాయకుడన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ సరైన గుర్తింపు ఇచ్చి వారిని అన్ని విధాలుగా ప్రొత్సహిస్తున్నారని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం యాదవుల అభివృద్ధికి ఎంతోగాను కృషిచేస్తుందని, ఒకవైపు సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తూ, మరోవైపు యాదవులను రాజకీయాల్లో క్రియశీలంగా ఎదుగటానికి అనేక అవకాశాలను కల్పిస్తుందన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలుపించుకోవటానికి తమంతా శక్తివంచనలేకుండా కృషి చేస్తామని, సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.