హైదరాబాద్: సోషల్ మీడియాలో బీజేపీ క్షుద్ర విద్యను ప్రదర్శిస్తున్నట్లు మంగళవారం సీఎం కేసీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌పై ఆయన తన నిరసనను వ్యక్తం చేసే క్రమంలో సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ ప్రచారాల, అబద్దాల గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో జర్నలిస్టు స్వాతి చతుర్వేది రాసిన ‘ఐ యామ్ ఏ ట్రోల్’ అన్న పుస్తకం గురించి కేసీఆర్ చెప్పారు. ఆన్లైన్లో బీజేపీ ఎలా మతవిద్వేషాలకు పాల్పడుతుందో ఆ పుస్తకంలో జర్నలిస్టు స్వాతి చక్కగా రాశారు. చాలా వ్యవస్థీకృత విధానంలో ట్రోలింగ్ జరుగుతున్న తీరు గురించి స్వాతి తన పుస్తకంలో వివరించారు. అయితే సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో తన పేరును ప్రస్తావించారని జర్నలిస్టు స్వాతి తన ట్వీట్లో తెలిపారు. ఇక కేసీఆర్ ప్రసంగ వీడియోను కూడా ఆమె ఆ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. బీజేపీ డిజిటల్ ఆర్మీ చేస్తున్న ఆగడాల గురించి ఐ యామ్ ఏ ట్రోల్ పుస్తకంలో స్వాతి విపులంగా రాశారు. మోదీ నేతృత్వంలో సాగుతున్న ఆ క్షుద్ర మీడియా వైనాన్ని ఆమె చాలా విశ్లేషణాత్మకంగా ప్రజెంట్ఠ చేశారు. తన పుస్తకం గురించి కేసీఆర్ ప్రస్తావించిన విషయాన్ని జర్నలిస్టు స్వాతి ట్విట్టర్లో పంచుకోవడం విశేషం.
Where KCR mentions me & cites my investigative book “I am a troll inside the secret digital Army of the Bjp” @juggernautbooks https://t.co/o0Go0sAOZH
— Swati Chaturvedi (@bainjal) February 1, 2022