CM KCR Press Meet : యాసంగి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ప్రజలకు చెప్పేందుకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డారు.
ధాన్యం సేకరణ విషయంలో మంత్రి వర్గంలో దాదాపు మూడునాలుగు గంటలపైగా చాలా సుదీర్ఘంగా చర్చ చేశాం. ఇక్కడ సింపుల్ విషయం ఏంటంటే.. మొన్న వెళ్లినప్పుడు మేం స్పష్టంగా అడిగాం. యాసంగిలో మేం ఇచ్చిందే తీసుకోలేదు. తీసుకుంటామని ఇక్కడ ఎఫ్‌సీఐ మేనేజర్ రాసిచ్చాడు. ఆయన రాసిచ్చిన లెటర్ నేను స్వయంగా మంత్రికి చూపించాను. నాముందే ఆయన్ను సస్పెండ్ చేస్తా అన్నడు మంత్రి. నువ్వు ఏదైనా చేయి.. రాసిచ్చిండు కాబట్టి.. మీరు బియ్యం తీసుకోవాలి అని నేను అడిగా. దీంతో మేము తీసుకోము. బాయిల్డ్ రైస్ తీసుకోము.. ఉప్పుడు బియ్యం తీసుకోము అని చెప్పాడు. మేము ఇప్పటికే రైతుల నుంచి కొన్నాం.. వాళ్లకు డబ్బులు కూడా ఇచ్చాము కదా.. అంటే దానికి సమాధానం చెప్పలేదు.
మెడ మీద కత్తి పెట్టి.. భవిష్యత్తులో మేము పారాబాయిల్డ్ రైస్ ఇవ్వం అని అండర్ టేకింగ్ ఇస్తే.. అవి తీసుకుంటం. లేకపోతే తీసుకోం అని చెప్పారు. ఇదంతా పోయిన యాసంగికి జరిగింది. మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నది కేంద్రం. లేకపోతే 25 లక్షల టన్నుల బియ్యం మన మీద పడుతాయి. అప్పటికే కొన్నం, ప్రొక్యూర్మెంట్ చేశాం. రైతులకు డబ్బులు కూడా పే చేశాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి. ఆర్థిక స్థితి కూడా అంత ఉండదు కదా.
మేము చాలాసార్లు వెళ్లినప్పుడు కూడా కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారు. మేము బాయిల్డ్ రైస్ ఒక గింజ కూడా తీసుకోం అన్నాడు. సరే.. రా రైస్ తీసుకుంటారు కదా. దాన్ని ఎంత తీసుకుంటారో ఒక కోటా ఇవ్వండి. సంవత్సరానికి ఎంత కోటా ఇస్తారో చెప్పండి అని అడిగాం. అది కూడా చెప్పం అన్నారు. వర్షాకాలంలో మీరు 40 లక్షలుకు ఇచ్చారు అన్నారు. 40 కాదు.. 62 లక్షల ఎకరాలకు సాగు చేశాం. ఎక్కువ వస్తది. కనీసం 90 లక్షలైనా మీరు తీసుకోవాలి అంటే కుదరదు అన్నారు. నేను, మంత్రులు, ఆఫీసర్లు, ఎంపీలు వెళ్లి అడిగితే కూడా దానిపై మేం సమాధానం చెప్పం అన్నారు. అది వర్షాకాలం పరిస్థితి.
యాసంగిలో తెలంగాణలో వడ్లు పండితే.. నూక శాతం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా వర్షాకాలంలో పండే బియ్యం 67 కిలోలు వస్తే.. యాసంగిలో పండే పంటకు బియ్యం 35 కిలోలే వస్తది. ఆ నష్టం ఎవరు భరించాలి. రైతు భరించలేడు అంటడు. మిల్లర్ భరించడు. మరి ఎవరు భరించాలి. దాని కోసం బాయిల్డ్ చేసి అమ్మితే కరెక్ట్‌గా వస్తుంది నూక కాదు అని బాయిల్డ్ చేసి అమ్మడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వచ్చాయి. లాస్ట్ ఇయర్ దాకా తీసుకుంటం అని రాపిచ్చుకున్నారు. ఇప్పుడు సడెన్ గా ఒక గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోము. మీరు రాసియండి అని మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారు. ఇప్పుడు రైతులు ఏం చేయాలి మరి. ఏం జరగాలి ఇప్పుడు.. అంటూ సీఎం కేసీఆర్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.