ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఎగువ నుంచి వరద ఉధృత్తి తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రానికి 25,498 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయ్యింది. ఆయకట్టు, త్రాగునీటి పథకాల నిర్వహణకు నీటి విడుదల జరుగుతుండగా ఎడమ కాలువకు 920, కుడి కాలువకు 730, సమాంతర కాలు వకు 850, భీమా-2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 9.439 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజక్టు నుంచి 25,660 క్యూసె క్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా విద్యు తుత్పత్తికి 23,212 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో 6 యూనిట్లలో విద్యుతుద్పత్తిని నిర్వహిస్తున్నారు.
ఎగువ జూరాలలో 3 యూనిట్ల ద్వారా 2.128 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 306.810 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాలలో 3 యూనిట్ల ద్వారా 2.543 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 331.812 మి.యూ ఉత్పత్తి జరిగింది.