వనపర్తి : రాజనగరం చెరువు పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన సుందరీకరణ పనులు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy )అన్నారు. రాజనగరానికి చెందిన 30 మంది, అదేవిధంగా ఖిల్లా ఘనపురం పర్వతపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ చేరారు.అలాగే బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ కుమార్ యాదవ్‌తో పాటు నాయకులు, కార్యర్తలు బీఆర్ఏస్ పార్టీలో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టణంలోని మురికి నీళ్లు మొత్తం రాజనగరం చెరువులోకి వస్తున్నది. దీనివల్ల పంటలు అన్ని విషతుల్యమై రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయన్నారు. మురుగు నీటిని పొలాల్లో కలువకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలోనే ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం అయిన తరువాత అన్ని రకాల వసతులు కల్పించడం వల్ల ఎన్నో కొత్త కొత్త షాపింగ్ మాల్స్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు వస్తున్నాయిని తెలిపారు.
బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, సీనియర్ నాయకులు రాములు యాదవ్, సింగిల్ విండో చైర్మన్లు రఘువర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మండల యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము, తదితరులు పాల్గొన్నారు.