Shahar Ki Baat | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నమూనాగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో నగర రూపురేఖలు మారిపోయాయి. పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నిబద్ధతతో పని చేస్తున్నారు.
ఐటీ రంగంలో హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్నది. అందుకు కేటీఆర్ మొక్కవోని దీక్షనే కారణం. మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధితో పారిశ్రామిక వృద్ధి జరిగింది. వ్యాపారాలు పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానాలతో నాలాంటి యువ వ్యాపారవేత్తలకు ఎంతో మేలు జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి ఓ సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.
– కిషన్ సింగ్ ఠాకూర్, తిరుమల బాలాజీ పేపర్ ఇండస్ట్రీ, బేగంబజార్