అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించగా.. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలుపొందింది.
అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన యంగ్‌ఇండియా.. ఆదివారం 201 పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసింది.