‘ఎన్టీఆర్ యుగపురుషుడు. కారణజన్ముడు. అలాంటి వారు ఓ మహత్తర కార్యం కోసం దివి నుంచి భువికి వస్తారు. జీవితాన్ని సాఫల్యం చేసుకొని, కోట్ల మందికి ఆదర్శప్రాయులై మరలా దివికేగుతారు.
‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారు. గుండెల నిండా అభిమానంతో ఆ యుగ పురుషున్ని స్మరించుకుంటున్నారు.