అప్పుడు నాకు పదమూడేళ్ల వయసు ఉంటుంది. ఒకరోజు సడన్గా మా ఇంటికి ఒకాయన వచ్చాడు. ఆయన మామూలు వాళ్లలా కాకుండా పసుపు పచ్చని ధోతి కట్టుకుని, పైన ముదురు గులాబీరంగు ఉత్తరీయం వేసుకుని ఉన్నాడు.
అయితే, బాగా చిన్నప్పుడు నేనూ, అక్కా ఓచోట కూర్చుని ఆడుకుంటున్నప్పుడో, రాసుకుంటున్నప్పుడో అక్క హఠాత్తుగా కనురెప్పలు లోపల ఎర్రగా కనిపించేలా పైకి మడిచిపెట్టి, నాలుక బయటికి చాచి.. “ఏయ్! ఇంటున్నవా.. లేదా?! నేను �