దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను, దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ సభ్యులను, ప్రకృతి ప్రేమికులను ఎక్కడికక్కడ నిర్బంధించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని వికారాబాద్లో పెట్టడం దారుణమని, ప్రభుత్వం తన ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు డిమాండ్ చేశారు.