ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి రష్యాపై ఏమాత్రమూ పనిచేయటం లేదు. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా భీకరమైన క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడుతున్నది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మంగళవారం తెల్లవారుజామున రష్యా భారీ దాడికి పాల్పడింది. అయితే భూ, జల, వాయు మార్గాల ద్వారా క్రెమ్లిన్ సేనలు ప్రయోగించిన 18 డ్రోన్ క్షిపణులను సమర్థంగా కూల్చేశామని ఉక్రెయిన్ సైన�