టీఎస్పీఎస్సీ ఓ స్వతంత్ర సంస్థ. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కల్పతరువు. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న బాడీ. పటిష్ట భద్రత, నిఘాతో కొనసాగుతున్న సంస్థ.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందినవారు స్పష్టం చేస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికే అవకాశాల�