తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా తీరొక్క పూలతో భాగ్యనగరం మురిసిపోయింది. వివిధ ఆకృతుల్లో తయారు చేసిన బతుకమ్మలు మహిళల కళాభిరుచిని చాటి చెప్పాయి. ‘ఎంగిలిపూల’తో మొదలైన పూల జాతర గురువారం సద్దుల బతుకమ్మతో ముగిసింది.
మహా నగరంలో గురువారం పూల కోలాహలం కొనసాగింది. నగరంలో ఏ మూల, ఏ ప్రధాన కూడలి చూసినా
పలు రకాల పూలు జాతర చేశాయి. నగరమంతా పూల సువాసనలతో గుబాళించింది. ఉదయం నుంచి సాయంత్రం పొద్దు పోయేదాకా.. పూల పండుగ ఆడంబరంగా సాగింది