సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి ‘టిల్లు స్కేర్' టైటిల్ను ఖరారు చేశారు.
‘సహజత్వం, వాస్తవికతను ప్రతిబింబించే పాత్రల్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. కమర్షియల్ చిత్రాల్లో నటించినా..అభినయ ప్రధానమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తా’ అని చెప్పింది యువ కథానాయిక వర్ష బొల్లమ్మ.