చెడ్డవాళ్లకు డాకు.. మంచివాళ్లకు మహారాజు
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నందమూరి బాలకృష్ణ.. అదే దూకుడు కొనసాగిస్తూ చేసిన ప్రెస్టేజియస్ యాక్షన్ డ్రామా ‘డాకు మహారాజ్'. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నందమూరి బాలకృష్ణ.. అదే దూకుడు కొనసాగిస్తూ చేసిన ప్రెస్టేజియస్ యాక్షన్ డ్రామా ‘డాకు మహారాజ్’. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను అమెరికా డల్లాస్‌లో విడుదల చేశారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.39 నిమిషాలకు ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 44 సెకన్లున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ‘అనగనగా ఒక రాజు ఉండేవాడు.. చెడ్డవాళ్లంతా ఆయనను డాకు అనేవాళ్లు.
మాకు మాత్రం మహారాజ్..’ అనే చిన్న పాప వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. తొలుత ‘డాకు మహారాజ్’గా, తర్వాత చిన్నారిని రక్షించే నానాజీగా రెండు కోణాల్లో మాస్ మెచ్చేలా బాలయ్య ఈ ట్రైలర్లో కనిపిస్తున్నారు. హాస్యం, ఉద్వేగం, యాక్షన్ మేళవింపుగా ట్రైలర్ సాగింది. బాబీ డియోల్ విలన్‌గా, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, మకరంద్ పాండే కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. హాలీవుడ్‌ని తలపించేలా విజువల్స్ ఉంటాయని, తమన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

