కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో పైచేయి సాధించేందుకు బహుళజాతి సంస్థలు పోటీ పడుతున్నాయి. వందల కోట్లు ఖర్చు చేసి కొత్త ఫీచర్లతో ఉచితంగా ఏఐ చాట్బోట్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
తన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ ద్వారా సూపర్ కంప్యూటర్ తయారు చేయాలని సంకల్పించినట్టు టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో ఇన్వెస్టర్లకు వెల్లడించారు.